సీఎం కేసీఆర్ సూచన మేరకు హైదరాబాద్ లో మెట్రో రైల్ మార్గాల విస్తరణకు హెచ్ఎంఆర్ కసరత్తు ప్రారంభించింది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎంఆర్) తో సమాలోచనలు జరిపింది. డీఎంఆర్ ఎండీ మంగూ సింగ్ తన బృందంతో ఇవాళ హైదరాబాద్ వచ్చారు. హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి బృందంతో కలిసి ప్రతిపాదిత మార్గాలను పరిశీలించారు. నాగల్-ఎల్బీ నగర్ మధ్య లైన్ ను కలపడం, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు పొడిగించడం, రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు విస్తరించే మార్గాలను చూసి వచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని హెచ్ఎంఆర్ కార్యాలయంలో చర్చించారు. ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లను కలిపేలా, ఔటర్ రింగ్ రోడ్డు వరకు మెట్రో రైలు మార్గాన్ని విస్తరించేందుకు పథకం రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. విస్తరణ మార్గాలకు సంబంధించి నెల రోజుల్లో ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనున్నారు.
మెట్రో రైలు మార్గం విస్తరణకు కసరత్తు ప్రారంభించింది.




