Tuesday, 3 November 2026

క్రైస్తవసోదరులకు క్రిస్‌మస్‌ గిఫ్ట్‌

3

కైస్త్రవ భవన్‌కు కేసీఆర్‌ శంకుస్థాపన

హైదరాబాద్‌,డిసెంబర్‌23: క్రిస్మస్‌ కానుకగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కైస్త్రవ భవన్‌కు శం కుస్థాసన చేశారు. వెస్ట్‌  మారేడ్‌పల్లిలోని మహేంద్రహిల్స్‌లో రూ.10కోట్లతో భవనాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది క్రిస్మస్‌ వేడుకలను కైస్త్రవ భవన్‌లో నిర్వహించుకుందాని ఈ సందర్భంగా కేసీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఈ సం దర్భంగా ఆయన క్రిస్మస్‌, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఉపన్యాసాలు వద్దని కార్యాచరణెళి ముఖ్య మని అన్నారు. ఈ కార్యక్రమంలో

మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. మంత్రులు హరీష్‌ రావు, జగదీశ్వర్‌. తలసాని, పద్మారావు తదితరులు హాజరయ్యారు. కైస్త్రవుల భవన నిర్మాణానికి మల్కాజ్‌గిరి మండలం మహేంద్రహిల్స్‌లో  రెండు ఎకరాల స్థలం కేటాయించారు. భవన నిర్మాణానికి రూ. 10 కోట్లు మంజూరు చేసిన విషయం విదితమే. ప్రభుత్వం దళిత కైస్త్రవుల కోసం మూడు ఎకరాల భూ పంపిణీ చేస్తామని ప్రకటించింది. కల్యాణలక్ష్మీ పథకం ఇకపై దళిత కైస్త్రవులకు వర్తిసుందని, ఎస్సీలకు వర్తించే పథకాలన్నీ దళిత కైస్త్రవులకు వర్తిస్తాయని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *