చతికిల పడ్డ కాంగ్రెస్
న్యూఢిల్లీ,డిసెంబర్23: ఝార్ఖండ్, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను బట్టి ఝార్ఖండ్‌లో భాజపా ఆధిక్యం ప్రదర్శిస్తుండగా, జమ్మూకశ్మీర్‌లో హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఝార్ఖండ్‌లో భాజపా కూటమి ఆధిక్యంలో ఉంది. జేఎంఎం 6 స్థానాల్లో గెలుపొంది, ఝార్ఖండ్‌లో భాజపా ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. జమ్మూ కశ్మీర్‌లో భాజపా, పీడీపీ మధ్య ¬రా ¬రీ పోరు కొనసాగుతోంది. భాజపా 11స్థానాల్లో విజయం సాధించి 15 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. పీడీపీ 17 స్థానాల్లో గెలుపొంది, 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్ 7 స్థానాల్లో విజయం సాధించి 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించి తొమ్మిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు ఒకస్థానంలో విజయం సాధించి 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. జమ్మూకశ్మీర్, ఝార్ఖండ్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో రెండు రాషాల్లోనూ అధికారంలో వున్న రాజకీయపక్షాలకు ఎదురుదెబ్బ తగిలింది. ఝార్ఖండ్‌లో సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎంప్రభుత్వాన్ని ఓటర్లు తిరస్కరించారు. కశ్మీర్‌లో ఒమర్ అబ్దుల్లా ఆధ్వర్యంలోని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం ఓటమి పాలయింది.ఝార్ఖండ్, జమ్మూకశ్మీర్ రాషాలె అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో భాజపా ఆధిక్యం ప్రదర్శించింది. ఝార్ఖండ్‌లో స్పష్టమైన ఆధిక్యం సాధించగా జమ్మూకశ్మీర్‌లో గణనీయ ఫలితాలను సాధించింది. 2014 లోక్‌సభ ఎన్నికల అనంతరం దేశంలో రాజకీయచిత్రంలో వ్లిపవాత్మకమార్పులు చోటుచేసుకున్నాయి. దేశంలో అతిపెద్ద రాజకీయపక్షంగా వున్న కాంగ్రెస్ స్థానాన్ని భాజపా క్రమంగా భర్తీచేస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో మోదీ సారథ్యంలోని ఎన్డీయే ఘన విజయం సాధించిన అనంతరం దేశ రాజకీయాలపై మోదీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఝార్ఖండ్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 14 స్థానాలకు గానూ భాజపా 12 స్థానాలు సాధించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా కేవలం 18 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించడం విశేషం . మోదీ పరిపాలనా దక్షత, అవినీతి రహిత పాలనను దేశ ప్రజలు ఆదరిస్తున్నారని తాజా ఎన్నికలు రుజువుచేస్తున్నాయి. మోదీ ప్రభావానికి తోడు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాజకీయ వ్యూహ చతురత పార్టీ విస్తరణకు తోడ్పడుతోంది. కశ్మీర్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలు సాధించిన భాజపా తాజా ఎన్నికల్లో దాదాపు రెట్టింపు స్థానాలు సాధించడం గమనార్హం. ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన అనంతరం తొలిసారిగా మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలో చిరకాల మిత్రపక్షం శివసేనను కాదని వేరుగా పోటీచేసిన భాజపా మెజార్టీకి





