Monday, 2 November 2026

దర్శకుడు కె.బాలచందర్‌ కన్నుమూత

4

చెన్నై: ప్రముఖ దర్శకుడు, నటుడు, నిర్మాత కె.బాలచందర్‌ ఇకలేరు. తీవ్రమైన అనారోగ్యంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. శ్వాసకోస, మూత్రపిండాలకు సం బందించిన అనారోగ్య సమస్యల తో గత కొంత కాలంగా ఇక్కడి కావేరి ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ మృతి చెందారు. కైలాసం బాలచందర్‌ వయస్సు 84 సంవత్సరాలు. దర్శక చంద్రు ని మరణ వార్త తెలియగానే సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. బాలచందర్‌ కుటుంబం సభ్యులు, స్నేహి తులు శోకసంద్రంలో మునిగిపోయారు.

బాలచందర్‌ జీవిత విశేషాలు:

బాలచందర్‌ 1930 జూలై 9న తమిళనాడులోని తంజావూరు వద్ద ఉన్న నన్నిలం గ్రామంలో తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లి తం డ్రులు సరస్వతీ, దండపాణీలు. చిన్నప్పటినుండి నటన అంటే అమితాసక్తి ప్రదర్శించేవారు. 1949 సంవత్సరంలో సామాన్య శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. 1956లో రాజంను పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ఒక కూతురు పుష్పాకందసామి, ఇద్దరు కుమారులు కైలాసం బాలచందర్‌, ప్రసన్న బాలచందర్‌. ఇటీవలే ఆయన కుమారుడు

కైలాసం బాలచందర్‌(54) చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. కుమారుని మరణంతో బాలచందర్‌ మానసికంగా కుంగిపోతు వచ్చారు.

బాలచందర్‌ సినీ ప్రస్థానం

1960లో సినీ రంగానికి పరిచయమైన బాలచందర్‌ తన సినీ జీవితంలో ఎన్నో అద్బుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. మరి కొన్నింటిలో నటించారు. మొదటగా ఆయన ఎంజీఆర్‌ చిత్రానికి మాటలు, స్క్రీన్‌ప్లే రాశారు. అబద్దం, రెట్టసుళి చిత్రాలలో విలన్‌గా నటించి ఉత్తమ విలన్‌ అవార్డు గెలుచుకున్నారు. ఉత్తమ విలన్‌ చిత్రంలో ఆయన శిష్యుడైన కమల్‌ హాసన్‌ విజ్ఞప్తి మేరకు నటించారు. ఈ సినిమాలో మరో ప్రఖ్యాత దర్శకుడు, బాలచందర్‌ సమకాలీకుడైన కె.విశ్వనాథ్‌ కూడా నటించారు.

భారత చలన చిత్ర పరిశ్రమకు దశా దిశ చూపిన దర్శక దిగ్గజం కె.బాలచందర్‌. ఆయన తెలుగు, హిందీ, మలయాళం, కన్నడల్లో 100కు పైగా అద్బుతమైన సినిమాలను రూపొందించారు. కమల్‌హాసన్‌, రజనీకాంత్‌, మమ్ముటి, ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, జయప్రద, సరితతో పాటు 20 మందికి పైగా నటీ, నటులను వెండి తెరకు పరిచయం చేశారు. జెమినీ గణేశన్‌, షావుకారు జానకి, నగేష్‌, ముత్తురామన్‌తో సుధీర్ఘకాలం పనిచేశారు. మొదట ఆయన ఏజీ ఆఫీసులో ఉద్యోగం చేశారు. ఉద్యోగిగా పనిచేస్తూ పలు నాటకాలు రాశారు. తను దర్శకత్వం వహించిన తొలి సినిమా నీర్కువ్జిూ 1965 సంవత్సరంలో విడుదలైంది. తొలి తెలుగు చిత్రం భలేకోడల్లు 1968లో విడుదలైంది.

అంతులేని కథ, ఆకలిరాజ్యం, రద్రవీణ, తూర్పు పడమర, జీవితరంగం, తొలికోడి కూసింది, మరో చరిత్ర, గుప్పెడు మనస్సు, కోకిలమ్మ, భలే కోడళ్లు, ఆడవాళ్లు విూకు జోహార్లు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనకు ఎన్నో పురస్కారాలు ఇచ్చి గౌరవించాయి.

– 1965లో తొలిసారిగా తమిళ చిత్రానికి దర్శకత్వం

– 1973లో తమిళనాడు ప్రభుత్వం కలైమా మణి పురస్కారం

– 1987లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం

– 1982లో ఏక్‌ దూజే కేలియే చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ ప్లే అవార్డు

– 2010లో భారత ప్రభుత్వం దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు

– మరో చరిత్ర చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు

– 2010లో ఏఎన్‌ఆర్‌ జాతీయ పురస్కారం

– తొమ్మిది జాతీయ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *