Tuesday, 3 November 2026

ఖమ్మం నగరంలో 5 వేల ఇళ్లు

C
– అభివృద్ధికి సమద్ర ప్రణాళిక

– సీఎం కేసీఆర్‌

ఖమ్మం,ఫిబ్రవరి 15(జనంసాక్షి): ఖమ్మం నగరంలో పెద్దసంఖ్యలో పేద ప్రజలు ఉన్నారని.. వారి కోసం ఇళ్లు కట్టేందుకు దాదాపు 300 ఎకరాల భూమి అందుబాటులో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఖమ్మంలో విూడియాతో మాట్లాడారు. ఖమ్మం నగరంలో ఇప్పటికే 2 వేల ఇళ్లు మంజూరు చేశామని, మరో 3 వేల ఇళ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు. 2 పడక గదుల ఇళ్ల కోసం దాదాపు 5 కిలోవిూటర్ల దూరంలోపే స్థలం ఉందని పేర్కొన్నారు. ఖమ్మంలో మార్కెట్లు, డంపింగ్‌యార్డులు ఉండాల్సిన సంఖ్యలో లేవన్నారు. కనీసం 50 వేల మందికి ఒక మార్కెట్‌ ఉండాలన్నారు. నగరంలో అధునాతన బస్‌ ప్రాంగణం నిర్మిస్తామని చెప్పారు.

వివిధ అభివృద్ది పనులపై సవిూక్ష

వివిధ అబివృద్ది పనులకు శంకుస్థాపనతో పాటు, సవిూక్షించేందుకు రెండురోజుల పర్యటన కోసం సిఎం కెసిఆర్‌ ఖమ్మం చేరుకున్నారు. ఇక్కడ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకుస్థాలన్ని పరిశీలించారు. అలాగే ఇంటిగ్రేటెడ్‌ బస్‌ స్టాండ్‌ నిర్మాణంపై సవిూక్షించారు. ఖమ్మంచేరుకున్న ఆయనకు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తదితరులు స్వాగతం పలికారు. అయితే  రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఖమ్మం పర్యటనలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. కెసిఆర్‌ సోమవారం నాడు ఉదయం ఖమ్మం జిల్లాలో పర్యటనకు రాగా ఉదయం రమణగుట్ట, వికలాంగుల కాలనీల్లో కెసిఆర్‌ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రమణగుట్ట, రధబలి నగర్‌, వడ్డెర కాలనీ, హనుమాన్‌ నగర్‌ ప్రాంతాల్లోని మురికి వాడలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలించారు. అక్కడి ప్రజలను మౌళిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. రైళ్లు, రోడ్ల విషయమై ప్రతిపాదనలు చేయాలని ఇందుకోసం సమగ్ర ప్రణాళిక రూపొందించాలని నగర పాలక అధికారులను ఆదేశించారు. అనంతరం బైపాస్‌ రోడ్డులో ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు పిడిఎస్‌యు విద్యార్థులు ప్రయత్నించారు. ఫీజు రీయింబర్సుమెంట్స్‌ వెంటనే చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. దీంతో వారు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం నగరంలో పర్యటించిన సీఎంను సిపిఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. వీటిని పెద్దగా పట్టించుకోని సిఎం కెసిఆర్‌  నూతన బస్టాండ్‌ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం రాపర్తినగర్లో డంపింగ్‌ యార్డు స్థలాన్ని పరిశీలించి తిరిగి వెళ్తుండగా సిపిఎం కార్యకర్తలు సీఎం కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరారు. మధ్యాహ్నం నుంచి ఆయన బిజీబిజీగా ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు లకారం చెరువును పరిశీలించారు. సీఎం వెంట మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావుతోపాటు పలువురు అధికారులు ఉన్నారు. అంతకు ముందు ఆయన ఆర్టీసీ కొత్త బస్టాండ్‌, ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు ప్రతిపాదనలపై మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, జిల్లా అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బైపాస్‌ రోడ్డులో డంపింగ్‌ యార్డు స్థలాన్ని సీఎం పరిశీలించారు. రమణగుట్టలో పర్యటించిన సీఎం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు.  ఈ సందర్భంగా ఆయనకు వినతిపత్రాలు అందజేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ సోమవారం ఖమ్మం నగరానికి వచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌, కలెక్టర్‌, ఎస్పీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఖమ్మం నగర అభివృద్ధిపై సవిూక్షలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. కెసిఆర్‌ వెంట తెరాస నేతలు కె కేశవ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇదిలావుంటే ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ నేతలు అర్థరహిత విమర్శలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు అన్నారు. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకే సీతారామా ప్రాజెక్టును నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్‌, అనుభవజ్ఞులైన ఇంజినీర్లతో సీఎం కేసీఆర్‌ సమక్షంలో మేదోమథనం జరిగిన తర్వాతే ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఫిబ్రవరి 4న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నివేదికను ఆమోదించారని పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్‌ మంగళవారం శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *