హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి లడ్డూ ప్రసాదం కోసం భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. శుక్రవారం లడ్డూ పంపిణీ చేయనున్నట్లు నిర్వహాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. మహాదేవుడి లడ్డూ ప్రసాదం 6 వేల కిలోలు. స్వామి ప్రసాదం దక్కించుకోవడం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రసాదం పంపిణీలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ కమిటీ నిర్వాహాకులు ఏర్పాట్లు చేశారు.
ఖైరతాబాద్ లడ్డూ కోసం బారులు తీరిన భక్తులు




