
హైదరాబాద్: మహాత్మాగాంధీ 146వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బాపూ ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తెలుగు రాష్గాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ కేశవరావు తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అనంతరం బాపూఘాట్ వద్ద నిర్వహించిన సర్వమత ప్రార్థనలో ప్రముఖులు పాల్గొన్నారు.
బాపూఘాట్ వద్ద నివాళులర్పించిన గవర్నర్, తెలంగాణ సీఎం కేసీఆర్




