నెల్లూరు : మాజీ మావోయిస్టు నేత గంటి ప్రసాదం హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. హత్యా స్థలంలో పోలీసులు అణువణువూ పరిశీలించారు. హత్యకు ఉపయోగించిన కత్తిని మురికి కాల్వలో పడేసి ఉండొచ్చన్న అనుమానంతో కాలువలోనూ గాలింపు చేపట్టారు. హత్యాస్థలం పక్కనే ఉన్న కాలువలో పారిశుద్ధ్య కార్మికులతో వెతికించిన పోలీసులు అందులోంచి ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కత్తితోనే దుండగులు ప్రసాదంపై దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యేక బృందాల ద్వారా హంతకులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.




