గల్లంతయిన మత్స్యకారులు సురక్షితం

కాకినాడ, ఆగస్టు16(జ‌నం సాక్షి ) : కాకినాడ సముద్రంలో గల్లంతయిన దుమ్మలపేటకు చెందిన బోటులోని ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ గురువారం లభ్యమయ్యింది. వివరాల్లోకెళితే.. ఈ నెల 7వ తేదీన చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. 11న తిరిగి రావాల్సిన మత్స్యకారులు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన బోటు యజమాని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సవిూపంలో తాము సురక్షితంగా ఉన్నామని, బోటులో ఆయిల్‌ అయిపోవడంతో రాలేకపోయామని బోటు యజమానికి మత్స్యకారుల నుంచి గురువారం మధ్యాహ్నం ఫోన్‌ ద్వారా సమాచారం అందింది. దీంతో అధికారులు, బోటు యజమాని, మత్స్యకారుల కుటుంబీకులు ఊపిరిపీల్చుకున్నారు.
—————————

తాజావార్తలు