Tuesday, 3 November 2026

గవర్నర్‌ను కలిసిన తెతెదేపా నేతలు

5break94bహైదరాబాద్‌: తెలంగాణ తెదేపా నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సమావేశమయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ నేతృత్వంలో ప్రతాప్‌రెడ్డి తదితరులు గవర్నర్‌తో భేటీ అయ్యారు. ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకుండా ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రప్రభుత్వం అడ్డగోలుగా భూసేకరణ చేస్తోందని.. 2013 భూసేకరణ చట్టం అమలుకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఎంసెట్‌ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలను క్యాబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని కోరారు.

అనంతరం ఎల్‌.రమణ మీడియాతో మాట్లాడుతూ.. కోర్టులతో మొట్టికాయలు వేయించుకోవడం తెరాస సర్కార్‌కు పరిపాటిగా మారిందని ఎద్దేవా చేశారు. హైకోర్టు 123 జీవోను కొట్టేసినా అప్పీల్‌కు వెళ్లడం దారుణమన్నారు. ఎంసెట్‌-2 ప్రశ్నాపత్రం లీకేజీతో విద్యార్థులు మానసిక క్షోభను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *