Tuesday, 3 November 2026

భారీ వర్షంతో ముంబై జలమయం

rains-story_647_07141608435

ముంబైలో భారీ వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వానకి డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వర్షపు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. రోడ్లపై వరద భారీగా పారుతుండడంతో.. పలు ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దాంతో ప్రయాణికులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. అప్రమత్తమైన అధికారులు.. ముంపు బాధితులను అలర్ట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *