Tuesday, 3 November 2026

గాడ్సే దేశభక్తుడనందుకు క్షమాపణ చెప్పిన సాక్షి మహరాజ్‌

7
న్యూఢిల్లీ, డిసెంబర్‌12(జనంసాక్షి): జాతిపిత గాంధీ మహాత్ముని కాల్చి చంపిన నాధురావమ్‌ గాడ్సే గోప్ప దేశ భక్తుడని పొగిడిన భాజాపా ఎంపీ సాక్షి మహరాజ్‌ శుక్రవారం పార్లమెంట్‌కు బెషరత్తుగా క్షమపణ చెప్పారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, ఎవరినైనా నొప్పిస్తే క్షమించాలని ఆయన పేర్కొన్నారు. సభలో విపక్షాలు అప్రధానమైన అంశాలను సమస్యలుగా మారుస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఉన్నవ్‌ ఎంపీ అయిన సాక్షి మహరాజ్‌ వ్యాఖ్యలు విూడియాలో ప్రసారం కావడంతో విపక్షాలు ఎంపీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని పట్టుబట్టాయి. శుక్రవారం సభ ప్రారంభంకాగానే విపక్షాలన్నీ మూకుమ్మడిగా సాక్షి వ్యాఖ్యలపై నిరసన తెలిపాయి. సాక్షి మహారాజ్‌ వ్యాఖ్యలపై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్‌ చేసాయి. ఈ అంశంపై  లోక్‌ సభ  దద్దరిల్లింది. ఈ సందర్భంగా సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను పదినిమిషాలు పాటు వాయిదా వేశారు. తిరిగి సభ సమావేశమైన తరువాత విపక్ష సభ్యలు శాంతించక పోవడంతో పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ,సాక్షి మహారాజ్‌ తో మాట్లాడారు. అనంతరం సాక్షి మహారాజ్‌ సభలో మాట్లాడుతూ  తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, ఎవరినైనా నొప్పిస్తే క్షమించాలని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *