Tuesday, 3 November 2026

దమ్ముంటే నన్ను అరెస్ట్‌ చేయండి – మమతా బెనర్జీ

8 8

కోల్‌కతా డిసెంబర్‌ 12 (జనంసాక్షి) : దిదీకి మరో మారు కోపం వచ్చింది. శారదా చిట్స్‌ కుంభకోణానికి సంబంధించి పశ్చిమబంగ మంత్రి మదన్‌మిత్రాను సీబీఐ అరెస్టుచేయడంపై ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ మండిపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ, భాజపా అగ్రనాయకత్వానికి ‘య్రర్యముంటే తనను అరెస్టు చేయాలని సవాల్‌ విసిరారు. భాజపా కక్ష పూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ స్థాపనలో మదన్‌మిత్రా కీలకపాత్ర పోషించారు. సీఎంకు నమ్మకస్థులైన వ్యక్తుల్లో ఆయన ఒకరు. చిట్స్‌ కుంభకోణానికి సంబంధించి తృణమూల్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు సృంజయ్‌బోస్‌, కునాల్‌ ఘోష్‌లను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మంత్రి పదవికి మిత్రా రాజీనామా చేసినప్పటికీ తాను ఆమోదించడం లేదని ఆమె పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *