Tuesday, 3 November 2026

బోగ్గు గనుల ప్రత్యేక బిల్లుకు లోక్‌సభ అమోదం

6

దిల్లీ డిసెంబర్‌12(జనంసాక్షి): వివాదాస్పద బొగ్గుగనుల (ప్రత్యేక నిబంధనల) బిల్లు-2014ను లోక్‌సభ శుక్రవారం మూజువాణి ఓటుతో అమోదించింది. బొగ్గు క్షేత్రాలు/గనుల కేటాయింపులో పూర్తి పారదర్శకత ఉంటుందనీ, దేశ ప్రయోజనాలకు ఎలాంటి ముప్పు వాటిల్లదన్న హామీలతో ఈ బిల్లు ఆమోదం పొందింది. అక్టోబరులో ప్రభుత్వం జారీ చేసిన బొగ్గు గనుల ఆర్డినెన్స్‌-2014 స్థానంలో ఈ బిల్లు అమల్లోకి వస్తుంది. 204 బొగ్గు క్షేత్రాల కేటాయింపులను రద్దుచేస్తూ సెప్టెంబరులో సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలోనే కేంద్రం అక్టోబరులో ఈ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. అక్టోబరు 21న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జారీ చేసిన ఈ ఆర్డినెన్స్‌ను తిరస్కరించాలని కోరుతూ సీపీఐ సభ్యుడు సి.ఎన్‌.జయదేవన్‌ ప్రవేశపెట్టిన అధికారిక తీర్మానాన్ని లోక్‌సభ అంతకుముందు తిరస్కరించింది.బొగ్గుగనుల ప్రత్యేక కేటాయింపుల బిల్లుపై ప్రతిపక్షాలు శుక్రవారం లోక్‌సభలో విరుచుకుపడ్డాయి. స్థలసేకరణ, కార్మికుల సంక్షేమం తదితర పలు అంశాల విషయానికి సబంధించిన ఈ బిల్లులో పలు లొసుగులున్నాయని ఆరోపించింది. వెంటనే ఈ బిల్లును సంబంధిత పార్లమెంటరీ స్థాయి సంఘానికి పరిశీలన నిమిత్తం పంపాలని ప్రతిపక్షాలు గట్టిగా కోరాయి. బొగ్గుశాఖ మంత్రి పీయూష్‌ గోుౖల్‌ రెండురోజుల క్రితం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. శుక్రవారం దీనిపై జరిగిన చర్చలో కాంగ్రెస్‌ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ…బొగ్గుక్షేత్రాల వేలానికి సంబంధించి ఈ బిల్లులో ఏ మాత్రం స్పష్టత లేదన్నారు. బొగ్గుగనుల కార్మికుల జీవన ప్రమాణాల మెరుగుదల అంశమనేది బిల్లులో ఎక్కడా లేదన్నారు. యూపీఏ సర్కారు హయాంలో జరిగినట్లు బొగ్గుక్షేత్రాల వ్యవహారంలో మరో కుంభకోణం చోటు చేసుకోకుండా జాగ్రత్తపడాల్సిందిగా ఏఐఏడీఎంకే, బీజేడీల సభ్యులు హెచ్చరించారు. ఈ బిల్లును పార్లమెంటరీ స్థాయిసంఘం పరిశీలనకు పంపాల్సిందిగా తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు కల్యాణ్‌ బెనర్జీ డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *