Monday, 2 November 2026

గాయని మధుప్రియ వివాహం సుఖాంతం

zcdhsdjbఆదిలాబాద్ :  గాయని మధుప్రియ ప్రేమ వ్యవహారం సుఖాంతమైంది. బంధుమిత్రుల సమక్షంలో ఆమె వివాహం కాగజ్‌నగర్‌కు చెందిన బంగి శ్రీకాంత్‌తో జరిగింది. ఈ వివాహం ఇష్టంలేని మధుప్రియ తల్లిదండ్రులు ఈ వేడుకకు హాజరుకాలేదు. ఈ ఉదయం మధుప్రియ ప్రేమ వివాహానికి  తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పడంతో పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇద్దరూ మేజర్లు కావడంతో పెళ్లిని అడ్డుకోవద్దని మధుప్రియ తల్లిదండ్రులకు సూచించారు. కొంత సమయం ఇస్తే తామే వివాహం జరిపిస్తామని తల్లిదండ్రులు బదులిచ్చారు. ఇందుకు మధుప్రియ అంగీకరించలేదు. రెండు సంవత్సరాలుగా తనకు శ్రీకాంత్ తెలుసని చెప్పింది. నవంబర్ 2న హైదరాబాద్‌లో పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు మధుప్రియ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *