Tuesday, 3 November 2026

గాల్లో రెండు విమానాలు ఢీ

3

రోడ్డుపై వాహనాలు అదుపుతప్పి ఢీకొనడం, ప్రమాదాలు జరగడం కామన్. కానీ ఆకాశంలో విమానాలు ఢీకొన్న సంఘటనలు అరుదు. అమెరికా తీరంలో ఆకాశంలో రెండు చిన్నపాటి విమానాలు ఢీకొని సముద్రంలోకి పడిపోయాయి. లాస్ ఏంజిల్స్ హార్బర్ కు రెండు మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్టు అమెరికా కోస్ట్ గార్డ్స్,అధికారులు చెప్పారు.ఈ రెండు విమానాల్లో ఎంతమంది ప్రయాణిస్తున్నారు..చనిపోయినవారి వివరాలు తెలియరాలేదు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో లైఫ్ గార్డు బోట్ల సాయంతో డైవర్లు గాలింపు చర్యలు చేపట్టారు. విమానం రెక్క భాగాలను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. విమానాల శకలాలు సముద్రంలోపల 90 అడుగుల లోతున పడిఉంటాయని అధికారులు భావిస్తున్నారు. హార్బర్ ఎంట్రెన్స్ ను మూసివేసి సహాయక చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *