చిత్తూరు,మార్చి25 : డీఎస్సీ పరీక్షకు హాజరుకానున్న గిరిజన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వానున్నారు. వీరికి శిక్షణ ఇచ్చి పరీక్షలకు సిద్దం చేస్తారు. ఈ మేరకు జిల్లా గిరిజన సంక్షేమశాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని కొంగారెడ్డిపల్లిలో గల గిరిజన బాలుర వసతిగృహంలో శిక్షణ ఉంటుందని చెప్పారు. డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న గిరిజన అభ్యర్థులు ధవృపత్రాలతో శిక్షణ కేంద్రంలో హాజరుకావాలని కోరారు. ఇదిలావుంటే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 14 వికలాంగుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీకి జిల్లా కలెక్టర్ ప్రకటన విడుదల చేశారు. అంధుల విభాగంలో జనరల్ 12, బధిరుల విభాగంలో జనరల్ రెండు ఖాళీలున్నట్లు అందులో పేర్కొన్నారు. ఆసక్తిగల వారు ఏప్రిల్ ఆరో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని.. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడాలని తెలిపారు. అలాగే వికలాంగులు సంక్షేమశాఖ కార్యాలయంలో నేరుగా సంప్రదించవచ్చని చెప్పారు.




