Thursday, 5 November 2026

బ్యాంకు ఖాతాలుంటేనే పెన్షన్లు

విజయవాడ,మార్చి25 : అర్హులైనవారికి బ్యాంకుల ద్వారా పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం విజయవాడ నగరాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది.  ఈమేరకు నగరంలో గుర్తించిన 20 బ్యాంకుల్లో లబ్దిదార్లకు ఖాతాలు తెరిపించాలని కమిషనర్‌ వీరపాండ్యన్‌  సూచించారు. వీరికి జన్‌దన్‌ పథకం కింద జీరో బ్యాలెన్సు ద్వారా ఖాతాలు తెరిపించాలని ఆయన కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సామాజిక పింఛన్లను లబ్దిదారులు సక్రమంగా పొందేందుకు అనువుగా ప్రతి ఒక్కరిచేత బ్యాంకు ఖాతాలను తెరిపించాలని అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ సామాజికాభివృద్ధి సంస్థ అధికారులతో ఆయన  ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రధానంగా పింఛనుదార్లకు ఏప్రిల్‌ నెల నుంచి ఇంటింటికి బ్యాంకు కరస్పాండెంట్‌ ద్వారా పింఛను అందించేందుకు అనువుగా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు బ్యాంకు ఖాతాలను తెరిపించాలని ఆయన సూచించారు. నగరంలో 33 వేల మంది పింఛనుదార్లు ఉండగా, వీరిలో 15 వేల మందికి బ్యాంకు ఖాతాలు ఉండగా, మిగిలిన వారికి బ్యాంకు ఖాతాలు తెరిపించాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *