గుంటూరులో ఇద్దరు వ్యక్తుల దారుణ హత్య
దర్యాప్తు చేపట్టిన పోలీసులు
గుంటూరు,జూలై4(జనం సాక్షి ): జిల్లాలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఒకరిని బండరాళ్లతో కొట్టి చంపగా, మరొకరిని గొంతుకోసి హత్య చేశారు. జిల్లాలోని వెంగళాయపాలెంలో శివుడు నాయక్ అనే వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. బండరాళ్లతో మోది నాయక్‌ను హత్య చేశారు. నాయక్ మిర్చి యార్డులో ముఠా కూలీగా పని చేస్తున్నాడు. అయితే నాయక్‌ను మాజీ రౌడీషీటర్ హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరోవైపు జిల్లాలోని ఫిరంగిపురం రామాలయం వీధిలో మరో యువకుడిని దుండగులు హత్య చేశారు. పానీపూరి వాలా సీపూను గొంతు కోసి హత్య చేశారు. హతుడు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం జోహాన్ జిల్లాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
—–