Tuesday, 3 November 2026

గుంటూరు: బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్న బీజేపీ నేతలు : కొల్లా

కాకుమాను : బీజేపీ రాష్ట్ర నాయకులు బాధ్యత రహితంగా రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ నాయకులపై విమర్శలు చేయడం సిగ్గు చేటని సంగం డెయిరీ మాజీ చైర్మన్‌ కొల్లా వీరయ్య చౌదరి అన్నారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఆపార్టీ నాయకులు కన్నా లక్ష్మీ నారాయణ, సోము వీర్రాజు, యడ్లపాటి స్వరూపారాణి తదితరులు టీడీపీపై, సీఎంపై చేసిన విమర్శలు వారి అవివేకానికి నిదర్శనమన్నారు. కేంద్రం దయతలచి ప్రధాని ఆమోదించడం వల్లే ఎర్రచందనం అమ్మకం జరిపి చంద్రబాబు నాయుడు రైతులకు రుణమాఫీ చేశాడని యడ్లపాటి స్వరూపరాణి అవాకులు, చెవాకులు పేలడం సరికాదన్నారు. జన్మభూమి కమిటీ ద్వారా నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వ పథకాలు కేవలం తెలుగు తమ్ముళ్లకే పరిమితం అవుతున్నాయని చెబుతున్న యడ్లపాటి స్వరూపరాణి వాటిని నిరూపించాలని ఆయన సవాల్‌ విసిరారు. సమావేశంలో మార్కెట్‌ యార్డు డైరెక్టర్‌ పవన్‌కుమార్‌, ముస్లీం నేత జానీ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *