కర్నూలు: ‘రెవెన్యూ సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలి
నంద్యాల రూరల్: సోమవారం నుంచి నిర్వహిస్తున్న ‘మీ ఇంటికి-మీ భూమి’ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆర్డీవో సుధాకర్‌రెడ్డి తహసీల్దార్లకు సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ య జమానికి సంబంధించిన భూమి సర్వే నెంబర్, భూమి విస్తీర్ణంలో తేడాలుంటే రైతులు గ్రామ సభలోనే దరఖాస్తు చేసుకొనే విధంగా చూడాలన్నారు. రెవెన్యూ సదస్సులకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని తహసీల్దార్లకు సూచించారు.