Thursday, 5 November 2026

గుంటూరు మీదగా విశాఖ-ధర్మవరం – విశాఖ ప్రత్యేక రైళ్లు

గుంటూరు,  ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా విశాఖపట్టణం – ధర్మవ రం – విశాఖపట్టణం ప్రత్యేక రైళ్లను గుం టూరు మీదగా నడపనున్నట్లు రైల్వే గుం టూరు సీనియర్‌ డీసీఎం కే ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. నెంబర్‌ 07273 విశాఖపట్టణం – ధర్మవరం ప్రత్యేక రైలు ఈ నెల 18, 25 తేదీల్లో సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి 12.15 గంటలకు గుంటూరు చేరుకొని నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్‌, కంభం, గిద్దలూరు, నంద్యాల, బేతంచర్ల, డోన్‌, గుత్తి, అనంతపురం మీదగా మరుసటి రోజు మధ్యాహ్నం 12.40 గంటలకు ధర్మవరం చేరుకొంటుంది. నెం బర్‌ 07274 ధర్మవరం – విశాఖపట్టణం ప్ర త్యేక రైలు ఈ నెల 19, 26 తేదీల్లో మఽ ద్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి 12.30 గంటలకు గుంటూరు చేరుకొని మరుసటి రోజు ఉదయం 10.25 గం టలకు విశాఖపట్టణం చేరుకొంటుంది. ఈ అవకాశాన్ని ప్రయాణీకులు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్‌ డీసీఎం విజ్ఞప్తి చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *