తిప్పికొట్టిన తీర దళాలు
పడవను పేల్చేసిన ఆత్మాహుతి దళాలు

న్యూఢిల్లీ,జనవరి2(జనంసాక్షి): గుజరాత్ లక్ష్యంగా ఉగ్రవాదులు పన్నిన కుట్రను భారత తీర దళాలు గట్టిగా తిప్పికొట్టగలిగాయి. ముంబయి నాటి సంఘటన వలె కాకుండా తీర భద్రతా దళాలు ఎంతో అప్రమత్తం వహించడంతో ఈ కుట్రభగ్నమయింది. భారతదేశంపై మరోమారు ఉగ్రవాద దాడి చేసేందుకు పాకిస్థాన్ నుంచి కొందరు ఉగ్రవాదులు ఓ నౌకలో పోర్బందర్ తీరం గుండా మన దేశంలోకి ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నాన్ని భారత కోస్ట్ గార్డ్ బృందాలు గమనించి వారిని వెంబడించి, గంట పాటు వారిని నిలువరించారు. పట్టుకోడానికి ప్రయత్నం చేయగా, ఈలోపు నౌకలోని ఉగ్రవాద ఆత్మాహుతి దళాలు తమ నౌకను తామే పేల్చేసుకున్నారు. ఈసంఘటన పాక్ నుంచి ఉగ్రవాదులు మరోసారి భారత్‌పై దాడి జరపడానికి వచ్చినట్లు అనుమానాలకు ఆస్కారం కలిగిస్తోంది. గతంలో ముంబై విూద ఉగ్రదాడి చేసినప్పుడు కూడా ఇలాగే జలమార్గంలోనే ముంబైకి దూరంగా తీరంలోకి చిన్నబోటు సాయంతో ప్రవేశించారు. అయితే ఈసారి మన కోస్ట్ గార్డ్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించడంతో ఉగ్రవాదులు ఆత్మాహుతి చేసుకున్నారు. మత్స్యకారుల బోటులో వచ్చి భారత దేశంలో జనవరి ఒకటోతేదీన విధ్వంసం సృష్టించాలని లష్కరే తాయిబాకు చెందిన ఉగ్రవాదులు ప్రయత్నించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగింది. ముందుగా ఓ నౌకలో పోర్ బందర్ వరకు వచ్చిన ఉగ్రవాదులు… ఆ తర్వాత ఓ మత్స్యకార బోటు ద్వారా దేశంలోకి ప్రవేశించాలనుకున్నారు. అయితే.. వాళ్లు ఇంకా నౌకలో ఉండగానే అనుమానించిన కోస్ట్ గార్డ్ బృందాలు వాళ్లను వెంబడించడంతో.. భయపడి తమకు తాము పేల్చేసుకున్నారు. ఈ మేరకు కోస్ట్ గార్డ్ అందించిన రహస్య నివేదిక కేంద్ర ప్రభుత్వానికి చేరింది. పోర్బందర్‌కు 360 కిలోవిూటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. కరాచీలోని కేతిబందర్ ప్రాంతం నుంచి ఉగ్రవాదులు ఓ నౌకలో బయల్దేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బోటులో నలుగురు ఉన్నట్లు కోస్ట్ గార్డ్ బృందాలు గుర్తించాయి. లష్కరే తాయిబా బృందాలు దాడికి పాల్పడొచ్చని ఐబీ బృందాలు ఇటీవలే హెచ్చరించాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. జనవరి 1న.. లేదా జనవరి 26న ఉగ్రవాద దాడి జరగొచ్చని ముందుగానే హెచ్చరికలు వచ్చాయి. ఇంటెలిజెన్స్ హెచ్చరికలకు తగినట్లుగానే తాజా ఘటన జరగడంతో.. రాష్టాల్రన్నింటినీ కేంద్రం మరోసారి హెచ్చరించింది. పాకిస్థాన్‌లోని కరాచీ నుంచి అనుమతి లేని పడవ వస్తోందని తమకు సమాచారం వచ్చిందని, నిఘావర్గాల సమాచారంతో అర్థరాత్రి పడవను గుర్తించామని భారత రక్షణ శాఖ తెలిపింది. నౌక, యుద్ధవిమానంతో కార్యాచరణ చేపట్టామని రక్షణ శాఖ పేర్కొంది. గుజరాత్‌లోని పోరుబందర్ తీరం వద్ద తీరరక్షకదళం అధికారులు పాకిస్థాన్‌కి చెందిన ఒక మరపడవను గుర్తించి వెంబడించారు. దాంతో పాకిస్థాన్ మరపడవలో ఉన్న సిబ్బంది తమను తామే పేల్చేసుకున్నారు. కరాచీలోని కేతిబందుర్‌కు చెందిన ఈ మరపడవలో నలుగురు వ్యక్తులు, భారీ ఎత్తున పేలుడు సామగ్రి ఉన్నట్లు తీరరక్షకదళం గుర్తించింది. కరాచీ నుంచి ఓ పడవ బారత జలాల్లోకి ప్రవేశించి, అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాలు ఉప్పందిండంతో నిఘా సమాచారం మేరకు ఇండియన్ కోస్ట్ గార్డు దళాలు తమ నౌకలు, ఓ డోర్నియర్ విమానంతో ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఎట్టకేలకు అనుమానిత పడవను పోరుబందరు తీరానికి 365 కి.విూ. దూరంలో గుర్తించారు. ఆ పడవని ఆగమని భద్రతా దళాలు హెచ్చరించినా, బేఖాతరు చేస్తూ వేగం పెంచింది. దానిని గంట వరకు వెంబడించి, దాన్ని సవిూపించిన తర్వాత హెచ్చరిక కాల్పులు జరిపారు. ఆ పడవలోని నలుగురు వీటిని పట్టించుకోకుండా పడవ కింది భాగంలోకి వెళ్ళి దాక్కొని నిప్పంటించారు. తర్వాత అది పేలిపోయింది. చిమ్మచీకటి, ప్రతికూల వాతావరణం, బలమైన గాలులు వీస్తుండటంతో భద్రతా దళాలు పడవలోని వారిని రక్షించలేకపోయారు. భారత నౌకలు, విమానం ఇంకా సముద్ర జలాల్లో ఇంకా ఎవరైనా బతికే ఉన్నారా అని తెలుసుకునేందుకు శోధిస్తూనే ఉన్నాయి. వీరు లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాద గ్రూపుకు చెందినవారు. ఇంతకు ముందు ముంబై పై దాడి చేసినపుడు కూడా వారు ఓ చిన్న బోటులో ఆ నగరంలోకి ప్రవేశించారు. అయితే ఈ సారి మన దళాలు వాళ్ళ పాచిక పారనీయలేదు. దొరకుతామనే భయంతో ఉగ్రవాదులు ఆత్మాహుతి చేసుకున్నారు.




