విభజన చట్ట ప్రకారమే ఎంసెట్ నిర్వహణ :
గవర్నరుతో భేటీ అనంతరం విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి
హైదరాబాద్,జనవరి2(జనంసాక్షి): మీకు ఇంజినీరింగ్ సీటు కావాలంటే తెలంగాణ ఎంసెట్ పరీక్ష రాయాల్సిందేనని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి చెబుతున్నారు. విభజనచట్టం ప్రకారమే ఎంసెట్‌ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతోందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. తామే ఎంసెట్‌ను నిర్వహిస్తామని , ఈ విషయాన్ని గవర్నర్‌కు కూడా వివరించామని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముందుగా షెడ్యూల్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం పొరపాటు చేస్తోందన్నారు. ఏపీకి కూడా సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇంటర్ బోర్డు తమకు చెందుతుందని పునర్‌వ్యవ్థసీకరణ చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. పునర్వ్యవ్థసీకరణ చట్టంలో ఏమైనా మార్పు చేయాలంటే ఇరు రాష్టాల్రు కలిసి మాట్లాడుకోవాలన్నారు. అలాగే నిర్ణయాలు కూడా ఉమ్మడిగా చర్చించి తీసుకుంటే మంచిదన్నారు. తమ ప్రతిపాదనలపై గవర్నర్ సంతృప్తి వ్యక్తంచేశారని, ఎలాంటి వివాదాలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారని ఆయన తెలిపారు. ఇప్పటివరకు అమలవుతున్న విధానాన్నే కొనసాగిస్తామని చెప్పామన్నారు. ఓపెన్‌కోటాలో ఏ విధానం కొనసాగుతుందో అదే కొనసాగిస్తామని జగదీశ్‌రెడ్డి చెప్పారు. అందుకే ఎంసెట్‌ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించుకుంటుందని విద్యాశాఖ మంత్రి తేల్చి చెప్పారు. స్టేట్‌లెవల్ ఇనిస్టిట్యూట్స్‌లో పాత పద్దతినే కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఆంధప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధప్రదేశ్‌కు కూడా సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విభజన చట్టం ప్రకారమే నడుచుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. మా ప్రతిపాదనపై గవర్నర్ నరసింహన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అమలవుతున్న విధానాన్నే కొనసాగిస్తామని తెలిపారు. ఇదిలావుంటే ఎంసెట్‌పై కెసిఆర్ కూడా గవర్నర్‌తో ప్రాస్తావించారని సమాచారం. ఎపి ఏకపక్ష నిర్ణయాన్ని సిఎం గవర్నర్‌తో చర్చించారు. ఎంసెట్‌ను హైదరాబాద్‌లోని జేఎన్టీయూ మాత్రమే నిర్వహిస్తుందని, ఈసారి కూడా అదే పద్ధతిలో జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ విషయాలను పట్టించుకోకుండా ఏపీ సర్కార్ ఏకపక్షంగా తేదీలను ప్రకటించిందని గవర్నర్‌కు ఫిర్యాదుచేసినట్లు సమాచారం. ప్రవేశపరీక్ష నిర్వహణ కమిటీలలో ఆంధ్ర అధికారులను సభ్యులుగా నియమించామని, ఈ క్రమంలో ఏ ఒక్క ఆంధ్ర విద్యార్థికి అన్యాయం జరిగే ఆస్కారం లేదని గవర్నర్‌కు సీఎం కేసీఆర్ చెప్పారు. అవసరమైతే ఏపీ ఎంసెట్ నిర్వహణకు కూడా సహకారమందిస్తామని భరోసా ఇచ్చినట్లు తెలిసింది. తిరిగి శుక్రవారం మంత్రి కూడా గవర్నర్‌తో అన్ని విషయాలను చర్చించి నిర్ణయాన్ని ప్రకటించారు.





