Tuesday, 3 November 2026

‘గుట్ట’కు మహర్దశ

పలు అభివృద్ధి ప్రణాళికలకు సీఎం కేసీఆర్‌ ఆమోదం2

నల్గొండ,డిసెంబం17(జనంసాక్షి) : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేయాలని, యాదగిరిగుట్ట ప్రాంతాన్నంతా పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని బుధవారం ఆయన సందర్శించుకున్నారు. అనంతరం దేవాలయ అభివృద్దపై సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు అంశాలు పేర్కొన్నారు. యాదగిరి గుట్ట సవిూపంలోని అటవీ ప్రాంతాన్ని నరసింహ అభయారణ్యంగా మార్చి జింకల లాంటి జంతువులను, ఆధ్యాత్మిక మొక్కలను పెంచాలన్నారు. ప్రభుత్వ భూములను సర్వే చేసి ఖాళీగా ఉన్న రెవిన్యూ భూములను టెంపుల్‌ అధారిటికి అప్పగించాలన్నారు. రెవిన్యు,అటవీ భూముల మధ్య ఉన్న ప్రైవేటు స్థలాలను కూడా సేకరించాలన్నారు. గుట్ట పైన ఉన్న అస్థవ్యస్త కట్టడాలను తొలిగించాలన్నారు.గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేయడానికి అనువుగా రెండున్నర ఎకరాలను సౌకర్యవంతంగా, సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. అతిపెద్ద ఆంజనేయ విగ్రహాన్ని నెలకొల్పడానికి అనువైన స్థలాన్ని నిర్ధారించాలన్నారు. గరుత్మంతుడి విగ్రహం వద్ద ఫ్లాట్‌ఫాం నిర్మించాలన్నారు. అందరికి కనిపించే విధంగా గోపుర నిర్మాణం జరగాలన్నారు. యాదగిరిగుట్టలో దైవ సంబంధ కార్యక్రమాలే జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  సీఎంతో పాటు స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత, కలెక్టం చిరంజీవులు, ఎమ్మెల్సీ పూల రవీందర్‌, దేవస్ధాన అభివృద్ది కమిటీ స్పెషల్‌ ఆఫీసర్‌ కిషన్‌రావు, దేవాలయ స్థపతి, పూజారులు,రెెవిన్యూ,అటవీ శాఖ అధికారులు పాల్గ్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *