Tuesday, 3 November 2026

టీపీఎస్సీ ఛైర్మన్‌గా ఘంటా చక్రపాణి

5

సభ్యులుగా విఠల్‌, చంద్రావతి, మసీనుద్దీన్‌ ఖాద్రి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 17(జనంసాక్షి): కొత్త రాష్ట్రంలో నూతన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) కొలువు తీరింది. కమిషన్‌ మొదటి ఛైర్మన్‌గా ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్‌ సభ్యులుగా సి.విఠల్‌, మతీనుద్దీన్‌ ఖాద్రీ, డాక్టర్‌ బానోతు చంద్రావతిని నియమిస్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఘంటా చక్రపాణిది కీలక పాత్ర. అంబెడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో సోషియాలజీ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌గా సేవలందించారు. పలు పత్రికల్లో, ఛానళ్లలో తనదైన శైలిలో విశ్లేషణలు అందించారు చక్రపాణి . విఠల్‌ ఉద్యోగ సంఘాల నుంఛి ఉద్యమం చేసిన నేపథ్యం ఉంధి. ఇక చంద్రావతి గతంలో వైరా ఓ్గఎమ్లెల్యేగా పని చేశారు. గత ఎన్నికల్లో టీయారెస్‌ తరపున పోటీ చేసి ఓడిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *