Thursday, 5 November 2026

గుడారికుంట్లలో భారీ అగ్నిప్రమాదం..

తూర్పుగోదావరి, : కాకినాడలోని గుడారిగుంటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మూడు సిలిండర్లు పేలడంతో దాదాపు 50 పూరిళ్లు తగలబడ్డాయి. పేలుడు ధాటికి కొన్ని ఇళ్లు కుప్పకూలాయి. మంటలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. అగ్నిప్రమాదంతో ప్రజలు భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు. మరోవైపు కళ్లముందే ఇళ్లు తగలబడిపోతుండడంతో స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్నఅగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *