అనంతపురం:గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. మెయిన్‌బజార్‌లో పేపర్ వాహనం అదుపు తప్పి.. ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఫుట్‌పాత్‌పై పడుకున్న కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. తెల్లవారుజామున ఈ సంఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. మెడికల్ స్టోర్ వద్ద అదుపు తప్పి బీఎస్ఎన్‌ఎల్ స్తంభాన్ని ఢీకొట్టిందన్నారు. పేపర్ వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం సంభించిందని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.




