గూడూరులో కార్డెన్‌సర్చ్‌

నెల్లూరు,నవంబర్‌29(జ‌నంసాక్షి): గూడూరు గాంధీనగర్‌ ప్రాంతంలోని ఇళ్లలో పోలీసులు గురువారం కార్డాన్‌ సెర్చ్‌ నిర్వహించారు. దీనిలో భాగంగా గురువారం  ఉదయం గాంధీనగర్‌లో భారీగా పోలీసులు మోహరించారు. పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.