Thursday, 5 November 2026

గూడెంలో 27 నుంచి బ్ర¬్మత్సవాలు

ఏలూరు,మార్చి25: జంగారెడ్డిగూడెం రామాలయం బ్ర¬్మత్సవాలకు సిద్దం అవుతోంది. ఏటా ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయన్నారు.  27 నుంచి 29 వరకు వార్షిక బ్ర¬్మత్సవాలు జరగనున్నాయి. 27 ఉదయం 5గంటలకు సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయని ఆలయ అధికారులు తెలిపారు.  27 రాత్రి నాట్యాచారిణి రూపాదేవి శిష్య బృందంతో కూచిపూడి, జానపద నృత్యాలు ప్రదర్శించనున్నారు. 28 ఉదయం 10.30గంటలకు సీతారామస్వామి కల్యాణం జరుగుతుంది. అదేరోజు రాత్రి మల్లాది పర్వతి వర్థిని బృందం ఆధ్వర్యంలో సంగీత, సాహిత్య విభావరి నిర్వహించనున్నారు. 29న బ్ర¬్మత్సవాల ముగింపు పూజలు జరగనున్నాయి. 30న భక్తులకు అన్నదానం, అదేరోజు సాయంత్రం స్వామివారికి గ్రామోత్సవం నిర్వహిస్తారని  తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *