గోదావరిలో దూకి ప్రేమజంట ఆత్మహత్య
కాకినాడ,మే12(జనం సాక్షి ): పావర్లపూడి వద్ద దారుణం జరిగింది. బ్రిడ్జి పై నుంచి గోదావరిలో దూకి ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మృతులు శివ(21), ముత్యాల నాగసుజిత(15)గా గుర్తించారు. వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.