Thursday, 5 November 2026

గోదావరిలో దూకి వివాహిత ఆత్మహత్య

యలమంచిలి: పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడలో వశిష్ఠ వారధిపై నుంచి గోదావరిలోకి దూకి శనివారం ఉదయం వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల కథనం ప్రకారం… ఏడాది పాపను తీసుకుని చించినాడ బ్రిడ్జిపైకి వచ్చిన మహిళ పాపను ఫÛట్‌పాత్‌పై కూర్చొబెట్టి బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు మహిళను వారించే లోపే ఆమె గోదావరిలోకి దూకేసింది. పాప దగ్గర ఉన్న బ్యాగులో ఎలాంటి వివరాలు లభించలేదు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న యలమంచిలి ఎస్సై పాపను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *