Tuesday, 3 November 2026

గ్యాస్‌ సిలిండర్‌ పేలి వ్యక్తి మృతి

తిరుపతి : తిరుపతి నగరంలోని స్థానిక కనకభూషణం లేఅవుట్‌లో ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి వ్యక్తి మృతి చెందగా, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. కనకభూషణం లేఅవుట్‌లో ఎర్రయ్య (58) నివాసముంటున్నాడు. ఆదివారం రాత్రి ఇంటి వరండాలో ఉంచిన గ్యాస్‌ సిలెండర్‌ లీకవడంతో ఆపేందుకు వెళ్లాడు. అదే సమయంలో సిలిండర్‌ పేలడంతో అక్కడికక్కడే మృతి చెందగా.. అతని భార్య రెడ్డమ్మకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించారు. మంటలను అదుపు చేసి గాయాలపాలైన రెడ్డమ్మను స్థానికుల సహాయంతో తిరుపతి రుయా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎర్రయ్య కుప్పంలోని ఎల్‌ఐసీ కార్యాలయంలో పనిచేస్తున్నారు. అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *