గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధికి సహకారం
శ్రీకాకుళం నగరం: గ్రానైట్ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఫెడరేషన్ ఆఫ్ ఏపీ గ్రానైట్ ఇండస్ట్రీ, ఉత్తరాంధ్ర గ్రానైట్ ఓనర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. గ్రానైట్ వ్యాపారులు నిబంధనల ప్రకారం వ్యాపారం చేసుకోవడంతో పాటు పరిశ్రమ ద్వారా కార్మికులకు ఉపాధి కల్పించేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు చౌదరి ధనలక్ష్మీ, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, శ్రీకాకుళం శాసన సభ్యురాలు లక్ష్మీదేవి, ఉత్తరాంధ్ర గ్రానైట్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు కె.మురళీధర్, హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.