Tuesday, 3 November 2026

గ్రామదర్శినిలో పాల్గొన్న మంత్రి జవహర్‌

ఏలూరు,నవంబర్‌1(జ‌నంసాక్షి):పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు మండలం తోగుమ్మి గ్రామంలో గురువారం నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో మంత్రి జవహర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…శాశ్వత పరిష్కారం కోసం తోగుమ్మిలో ఎస్సి,ఎస్టీ సబ్‌ ప్లాన్‌ ద్వారా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. ప్రధానంగా గ్రామంలో నూతన పాఠశాల ఏర్పాటుకు స్థల సేకరణపై దృష్టి సారిస్తున్నాము. స్థల దాతలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తాం. అదేవిధంగా గ్రామంలో పక్కా గృహాలు నిర్మాణానికి చర్యలు తీసుకుని నూరు శాతం ఇళ్ళు నిర్మించాలని అధికారులకు సూచనలు జారీ చేశారు.