Tuesday, 3 November 2026

గ్రేటర్ వరంగల్ లో స్టాండింగ్ కమిటీకి నామినేషన్లు

gwmcగ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికల కోసం టిఆర్ఎస్ కార్పోరేటర్లు నామినేషన్ వేశారు. ఆరుగురు కార్పొరేటర్లు నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. కార్పొరేటర్లు లింగం మౌనిక, కావేటి కవిత, బైరబోయిన దామోదర్, వద్దిరాజ్ గణేష్, మిరిల్ కార్ దేవేందర్, నాగమళ్ళ ఝాన్సీ నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ నరేందర్ పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని మొత్తం 58 డివిజన్లకు గాను ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు. టిఆర్ఎస్ అభ్యర్థులకు పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *