Wednesday, 4 November 2026

ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురి మృతి

4exuqz73 గుంటూరు: జిల్లాలోని కొలనుకొండ వద్ద నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి వున్న లారీని టాటా ఇండికా కారు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోక వెళితే… విజయవాడ సత్యనారాయణపురంకు చెందిన కొంతమంది ఎపి 27 ఎఎ 7999 నెంబర్ గల టాటా వాహనంలో విజయవాడ నుంచి ఒంగోలు వెళ్తున్నారు. మార్గమధ్యలో మంగళగిరి మండలం కొలనుకొండ వద్ద జాతీయ రహదారిపై తెల్లవారు జాము 5 గంటలకు ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమ్తితం మంగళగిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వారి వద్ద ఆధార్ కార్డు ఆధారంగా మృతులు ఉప్పాడ రామ్మూర్తి రాజు, అతని భార్య విజయలక్ష్మీ లుగా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *