చంద్రన్న బీమా కింద చెక్కు అందచేత

నెల్లూరు,జూన్‌8(జ‌నం సాక్షి): తోటపల్లి గూడూరు మండలం కోవెరపాళేనికి చెందిన నాశిన శ్రీజకు చంద్రన్న బీమా కింద రూ.2 లక్షల మంజూరు పత్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అందజేసారు. శ్రీజ తండ్రి నాశిన శ్రీనివాసులు(43) ఆకస్మిక మరణానికి గురవడంతో చంద్రన్న బీమాలో తక్షణసాయంగా అంత్యక్రియలకు రూ.5 వేలు చెల్లించగా, ఇప్పుడు రూ.1,95,000 మంజూరైంది. గతంలో శ్రీజ తల్లి కూడా ఆకస్మిక మరణానికి గురైనప్పుడు అప్పటి నిబంధనల ప్రకారం రూ. 30 వేలు పరిహారం లభించింది.రాష్ట్రంలో 2.50 కోట్ల మందికి సంబంధించి ప్రీమియం చెల్లించి వారి జీవితాలకు బీమా చేసిన ఘనత చంద్రబాబుదని మంత్రి అన్నారు. చంద్రన్న బీమా మహత్తరమైన పథకం అని,పేదలు కుటుంబసభ్యులను కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రన్న బీమా అండగా నిలుస్తోందన్నారు.