Tuesday, 3 November 2026

చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు

టి.నగర్‌(రాజమండ్రి): రాష్ట్ర పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడికి తూర్పుగోదావరి జిల్లాలో ఘనస్వాగతం లభించింది. విశాఖపట్నం నుంచి విజయవాడ రోడ్డు మార్గంలో బయలుదేరిన చంద్రబాబు ఈరోజు ఉదయం రాజమండ్రి చేరుకున్నారు. స్థానిక లాలాచెరువు సెంటర్‌ వద్ద తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్యచౌదరి నేతృత్వంలో తెలుగు తమ్ముళ్లు బాబుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు కారు దిగి కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం విజయవాడ బయలుదేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *