చంద్రబాబుది ధర్మదీక్ష కాదు.. దొంగ దీక్ష

– తొలి నుంచి ప్రత్యేక¬దా కోసం పోరాడింది జగన్‌ ఒక్కరే

– ప్రత్యేక ¬దా తీసుకురావటం జగన్‌తోనే సాధ్యమవుతుంది

– వంచన దీక్ష సభలో వైసీపీ ఎంపీ మేకపాటి

విశాఖపట్టణం, జ‌నం సాక్షి ) : టీడీపీ ధర్మదీక్ష కాదని.. దొంగ దీక్ష అని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. విశాఖపట్నంలో వైసీపీ చేపట్టిన ‘వంచన దీక్ష’ వేదికగా టీడీపీ అధినేతపై మేకపాటి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక ¬దాను నాలుగేళ్లపాటు కేంద్ర వద్ద తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇప్పుడు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికి దొంగ దీక్షలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడు ఏముఖం పెట్టుకుని ధర్మ పోరాటం పేరిట దీక్ష చేస్తున్నారని నిలదీశారు ప్రత్యేక¬దా పదేళ్లు ఇస్తానని ఆనాడు మోదీ అంటే.. కాదు పదిహేనేళ్లు తీసుకొస్తానని చంద్రబాబు వాగ్దానం చేశారన్నారు. కానీ నేడు ఇద్దరూ కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక ¬దా వద్దు ప్యాకేజీ చాలని చెప్పి రాష్ట్ర భవిష్యత్తును చంద్రబాబు కాలరాశారన్నారు. టీడీపీ ఎంపీలు నాలుగేళ్లపాటు కేంద్రంలో మంత్రి పదవులు అనుభవించి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారన్నారు. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ

ప్యాకేజీని ప్రకటించినప్పుడు అంగీకరించిన చంద్రబాబు.. ఇప్పుడు ¬దా కావాలంటూ యూటర్న్‌ తీసుకున్నారన్నారు. ప్రత్యేక ¬దాపై మొదటినుంచి పోరాడుతున్నది వైసీపీ ఒక్కటే’ అని మేకపాటి వ్యాఖ్యానించారు. తమ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వల్లే ఇంకా ప్రత్యేక ¬దా అంశం సజీవంగా ఉందని మేకపాటి వెల్లడించారు. ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా తేగలిగే సత్తా ఒక్క వైఎస్‌ జగన్‌కే ఉందన్నారు. చంద్రబాబు వంచనకు మారుపేరని మండిపడ్డారు. నైతిక విలువలకు పాతరేసిన చంద్రబాబును ప్రజలు సహించరన్నారని హెచ్చరించారు.

 

తాజావార్తలు