చంద్రబాబును జైలుకు పంపే వరకు నిద్రపోను
– ప్రధానిని మరో 10సార్లు కలుస్తా
– టీడీపీకి వచ్చిన అభ్యంతరమేంటి
– వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
విశాఖపట్టణం, జనం సాక్షి ) : ఏపీ సీఎం చంద్రబాబు , అతని అనుచరులు రాజధానిపేరుతో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, చంద్రబాబును జైలుకు పంపే వరకు నిద్రపోనని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ప్రత్యేక ¬దాపై రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయంటూ వైసీపీ నేతలు విశాఖపట్నంలో ‘వంచన వ్యతిరేక దీక్ష’ చేపట్టారు. ఇటీవల తమ పదవులకు రాజీనామా చేసిన ఐదుగురు ఎంపీలతో పాటు.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యకర్తలు ఈ దీక్షలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరసనగా నల్లదుస్తులు ధరించారు. ఈ సందర్భంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విూడియాతో మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడుతూ.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూలదోస్తున్న చంద్రబాబును జైల్లో పెట్టించేవరకు నిద్రపోనని తెలిపారు. దేశంలో హవాలా, విదేశాల్లో ఆర్ముడ్ డీలర్లతో బాబుకు సంబంధాలున్నాయని ఆరోపించారు. తిరుపతిలో నిర్వహిస్తున్నది ‘ధర్మపోరాటదీక్ష’ కాదని, అధర్మ సభ అని అన్నారు. తాను ప్రధానిని కలుస్తున్నానని చంద్రబాబు పదే పదే గొంతు చించుకొని అరుస్తున్నాడని, ఒక ఎంపీగా ప్రధానిని కలిసే హక్కు తనకుందన్నారు. నేను ప్రధానమంత్రి మోదీని కలవడంపై తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని, నేను ప్రధానిని కలిసింది నిజమే, ప్రజా సమస్యలు, ప్రత్యేక ¬దా గురించి తెలిపేందుకు ఆయన్ను కలిశా అన్నారు. అవసరమైతే మరో 10 సార్లు ప్రధానమంత్రిని కలుస్తానని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతిపై ప్రధానమంత్రికి ఆధారాలు సమర్పిస్తానని, బాబును జైల్లో పెట్టించే వరకు నిద్రపోనని విజయసాయి రెడ్డి అన్నారు.