చంద్రబాబును జైల్‌కి పంపడం..

విూ బాబు వల్లే కాలేదు
– ఏవన్‌ ముద్దాయిగా ఉన్న జగన్‌కు చంద్రబాబును విమర్శించే అర్హత లేదు
– మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
అమరావతి, మే8(జ‌నం సాక్షి) : టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును జైలుకు పంపించడం మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి వల్లే కాలేదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. అమరావతిలో ప్రెస్‌విూట్‌లో ఆయన వైసీపీ అధినేత జగన్‌పై నిప్పులు చెరిగారు. చంద్రబాబును ఏ వన్‌గా జగన్‌ పరిగణించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. 12 కేసుల్లో ఏ వన్‌ గా ఉన్న వ్యక్తి చంద్రబాబును విమర్శించడం దారుణమని విమర్శించారు. గుడివాడ సభలో చిన్నా, పెద్దా, సీఎం ¬దా అనేవి మర్చిపోయి జగన్‌ రెచ్చిపోయాడని అన్నారు. ముదున్నరేళ్లలో రాష్ట్రాన్ని దోచుకుని, వ్యవస్థను బ్రష్టు పట్టించింది విూరు కాదా అని వైయస్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. కేసులకోసం ఆత్మగౌరవాన్ని మోడీకి జగన్‌ తాకట్టు పెట్టారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్టాల్లో రైతులకు మేలు చేసి, ఏపీ రైతులకు కేంద్రం అన్యాయం చేస్తుందని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు బరితెగించి ఇష్టమొచ్చిన భాష మాట్లాడుతున్నారని, కర్ణాటక ఎన్నికల్లో కోట్లు పంచి బీజేపీ గెలవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రా ప్రజల కోసం మోదీని నిలదీసిన వారు హీరో అని సోమిరెడ్డి పేర్కొన్నారు.

తాజావార్తలు