చంద్రబాబు ట్విట్టర్‌కు తాకిడి
పెరుగుతున్న ఫాలోవర్లు
అమరావతి,జూన్4(జనం సాక్షి ): చంద్రబాబు ట్విట్టర్‌కు ఫాలోవర్లు పెరుగుతన్నారు. ఈ మధ్యన ఆయనను ఎక్కువ మయయంది ఫాలో అవుతున్నారు. ఈ రోజుల్లో సోషల్‌విూడియా గురించి తెలియని వాళ్లు.. సోషల్ విూడియా ప్రభావం లేని వాళ్లుండరు. కాలానికి కంటే చాలావేగంగా దూసుకుపోతోంది. సోషల్ విూడియాను రాజకీయనాయకులు కూడా అస్త్రంగా చేసుకుని తమ ప్రత్యర్థులపై సెటైర్లు, ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు ఎప్పటికప్పుడు సాంఘిక మాధ్యమాల ద్వారా తమ వ్యక్తిగత విశేషాలను రాజకీయ అంశాలను అందరితో పంచుకుంటున్నారు. మరోవైపు నెటిజన్లు కూడా ఈ మాధ్యమాల ద్వారా తమ స్పందనలు తెలుపుతూ సోషల్ విూడియా పట్ల ఆసక్తి చూపుతూ ఉత్సాహ పరుస్తున్నారు. ఇక టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించిన సీఎం చంద్రబాబు సోషల్ విూడియాను విస్తృతంగా వాడుకుంటున్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు ట్విట్టర్‌కు 40 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. ట్విట్టర్‌లో తనకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ.. స్పందించిన వారందరికీ చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. తాజాగా చంద్రబాబు నవనిర్మాణ దీక్ష సందర్భంగా ట్విట్టర్ ద్వారా చౌక దుకాణాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి.. 500లకుపైగా నాణ్యమైన సరుకులు అందుబాటుధరల్లో అందించేందుకు రేషన్ షాపుల స్థానంలో చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటు చేశాం అని చంద్రబాబు ట్వీట్ చేశారు.