చంద్రబాబు, మోదీలు..

ప్రజా ద్రోహులుగానే మిగిలిపోతారు
– బాబు ఏ ఒక్క హావిూని నెరవేర్చలేదు
– చంద్రబాబు మోసాలను ప్రజలకు చెప్పడంకోసమే ‘వంచనపై గర్జన’
– వైఎస్సార్‌సీపీ అగ్రనేత భూమన కరుణాకర్‌ రెడ్డి
– ప్రత్యేక ¬దాను చంద్రబాబే నీరుగార్చారు – మేకపాటి
– గుంటూరులో వైసీపీ ‘వంచనపై గర్జన’ సభ
– భారీగా తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలు
– రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డ నేతలు
గుంటూరు, ఆగస్టు9(జ‌నం సాక్షి) : ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీలు ప్రజా ద్రోహులుగా మిగిలిపోతారని వైఎస్సార్‌సీపీ అగ్రనేత భూమన కరుణాకర్‌ రెడ్డి విమర్శించారు. గురువారం గుంటూరులో తలపెట్టిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ.. 600 హావిూలిచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ జీవితం వంచనతోనే ప్రారంభమైందని ఆయన ఎద్దేవా చేశారు. నాలుగేళ్లుగా చంద్రబాబు చేస్తున్న వంచన, మోసం, దగాకు వ్యతిరేకంగానే వంచనపై గర్జన దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు చేస్తున్న వంచనను ప్రజలకు చెప్పడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏపీకి ¬దా అవసరం లేదన్నట్లుగా చంద్రబాబు, మోదీలు వ్యవహరిస్తున్నారని అన్నారు.
ధర్మపోరాటాల పేరుతో ప్రజలను వంచన చేస్తున్నారు – బొత్స సత్యనారాయణ
టీడీపీ ప్రభుత్వం ధర్మపోరాటల పేరుతో ప్రజలను వంచిస్తోందని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేశారని అన్నారు. ప్రత్యేక ¬దా తెస్తానని ఇప్పటివరకు పోరాటం చేయలేదని తెలిపారు. బాబు మోసాలపై ప్రజలను చైతన్యం చేసేందుకే వంచనపై గర్జన దీక్ష చేపట్టామన్నారు. ప్రత్యేక ¬దాకోసం మొదటి నుంచి పోరాటం చేసింది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డేనని అన్నారు. ఒకే స్టాండ్‌పై వైసీపీ పోరాడుతుందన్నారు. కానీ చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయాలకోసం రోజుకో మాట చెబుతూ ప్రజలను వంచిస్తున్నారని అన్నారు. ప్రజలు విషయాన్ని గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన గుణపాఠం చెబుతారని బొత్స హెచ్చరించారు.
ప్రత్యేక ¬దాను చంద్రబాబే నీరుగార్చారు – మేకపాటి
ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ¬దాను నీరుగార్చారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యతను చంద్రబాబు మరిచిపోయారని అన్నారు. రాష్ట్ర విభజనకు లేఖరాసి చంద్రబాబు కారణమయ్యారని తెలిపారు. విభజన వల్ల ఆంధప్రదేశ్‌ అన్ని విధాలా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన సమయంలో పోలవరం, ¬దా, రైల్వేజోన్‌, పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌, వైఎస్సార్‌ జిల్లాకు ఉక్కు పరిశ్రమ, దుగరాజపట్నం వంటి హావిూలిచ్చి టీడీపీ, బీజేపీలు పట్టించుకోవటంలేదన్నారు. ఏపీకి ప్రత్యేక ¬దా కోసం ఇప్పటివరకు వైఎస్‌ జగన్‌ ఒకే మాటపై ఉన్నారని తెలిపారు. ¬దా కోసం వైఎస్‌ జగన్‌ అనేక కార్యక్రమాలు, పోరాటాలు చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను ఓటు అడిగే హక్కు చంద్రబాబుకు లేదని అన్నారు. వైఎస్సార్‌ సీపీ నుంచి 23మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను తీసుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు.  గత పార్లమెంట్‌ సమావేశాల్లో ఏం సాధించారో చూశామని.. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ఏం సాధిస్తారో చూద్దామని ఎద్దేవా చేశారు.
బాబు యూటర్న్‌ తీసుకొని.. అందర్నీ వంచించాడు – తమ్మినేని సీతారాం
¬దా పేరుతో ప్రజల్ని వంచించిన చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థల్ని నాశనం చేశాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత తమ్మినేని సీతారాం విరుచుకుపడ్డారు. నాటి నుంచి నేటి వరకు ¬దా కోసం పోరాడుతోంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీయేనని అన్నారు. ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని ఉద్ఘాటించారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడుతోంది జగనేనని అన్నారు.
¬దా అంశంపై యూటర్న్‌ తీసుకున్న చంద్రబాబు రైతులు, విద్యార్థులు, మహిళలు సహా అందర్నీ మోసం చేశాడని మండిపడ్డారు. మళ్లీ ఇప్పుడు ¬దా కోసం ధర్మ పోరాటం అని కొత్త నాటకానికి తెరలేపారని ఎద్దేవా చేశారు. బీజేపీతో నాలుగేళ్లు అధికారాన్ని పంచుకున్న టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలను తొక్కిందని
ధ్వజమెత్తారు. చంద్రబాబు దొంగ నాటకాలు ఇక సాగనీయమని హెచ్చరించారు. రాష్టాన్రికి ¬దా రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ఆకాక్షించారు.  వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసి రాష్ట్రానికి ప్రత్యేక ¬దా తేలేని అసమర్థుడన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు, మోదీలు ఇచ్చిన హావిూలు నెరవేర్చలేదని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి, నరేంద్ర మోదీ ప్రధాని అయినా ఏపీకి ¬దా రాలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన అసమర్థతను ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌, వైసీపీ నేతలు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు.

తాజావార్తలు