Tuesday, 3 November 2026

చర్చిద్దాం రండి!

C
– పాక్‌ ప్రధాని విదేశాంగ మంత్రితో సుష్మాస్వరాజ్‌ భేటీ

ఇస్లామాబాద్‌,డిసెంబర్‌9(జనంసాక్షి): భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి సర్తాజ్‌ అజీజ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో భారత్‌- పాక్‌ మధ్య స్నేహపూర్వక సంబధాల గురించి చర్చించారు.అంతకు ముందు సుష్మాస్వరాజ్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో భేటి అయ్యారు. ‘ హార్ట్‌ ఆఫ్‌ ఆసియా’ కార్యక్రమంలో పాల్గొనేందకు సుష్లా ఇస్లామబాద్‌ వెళ్లారు. ఇరు దేశాలు మరింత స్నేహ భావంతో మెలుగుతూ వర్తక వాణిజ్యాలను  పెంపొందించుకోవాలని సుష్మా ఆకాంక్షించారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఇస్లామాబాద్‌లో పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో భేటీ అయ్యారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఆమె పాక్‌ ప్రధానితో సమావేశమయ్యారు. దాదాపు మూడేళ్ల తర్వాత విదేశాంగశాఖ మంత్రులు పాకిస్థాన్‌లో పర్యటిస్తున్నారు.  భారత ప్రధాని నరేంద్ర మోదీ 2016లో పాకిస్థాన్‌ లో పర్యటిస్తారని సుష్మాస్వరాజ్‌ బుధవారం వెల్లడించారు. సార్క్‌ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి మోదీ పాకిస్థాన్‌ వెళ్లనున్నారని, ఆయనతో పాటు ఆ పర్యటనలో తానూ పాల్గొంటానని సుష్మాస్వరాజ్‌ తెలిపారు. ప్రస్తుతం ఇస్లామాబాద్‌లో హార్ట్‌ ఆఫ్‌ ఏసియా సదస్సులో పాల్గొంటున్న సుష్మాస్వరాజ్‌ ఈ విషయం తెలిపినట్లు అక్కడి జియో టీవీ ప్రసారం చేసింది. 2004లో వాజ్‌పేయీ సార్క్‌ సమిట్‌లో పాల్గొనడానికే పాకిస్థాన్‌ వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ భారత ప్రధాని పాకిస్థాన్‌ వెళ్లడం ఇదే ప్రథమం అవుతుంది.  పొరుగు దేశాలైన ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌లకు వాణిజ్యపరంగా పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ అన్నారు. ఇస్లామాబాద్‌లో జరిగిన ‘హార్ట్‌ ఆఫ్‌ ఏసియా’ సదస్సులో ఆమె మాట్లాడుతూ మూడు దేశాలూ పరస్పర అవగాహనకు వచ్చి ప్రాంతీయ వాణిజ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం ద్వారానే మార్పు సాధ్యపడుతుందని అన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ ట్రక్కుల్ని పంజాబ్‌లోని అత్తారీ సరిహద్దుల వద్ద అనుమతించేందుకు సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. వాణిజ్యం, రవాణా, ఇంధన వనరులు, కమ్యూనికేషన్‌ రూట్లు తదితరాల్ని పొరుగు దేశాలతో పరస్పర అవగాహన ద్వారా మెరుగుపరుచుకోవాలన్నదే భారత్‌ అభిలాష అని తెలిపారు.

పాక్‌, అఫ్ఘాన్‌లతో వాణిజ్య బంధం:సుష్మ

వ్యాపార, వాణిజ్య రంగాల్లో పాక్‌, అప్ఘాన్లతో చేతులు కలిపేందుకు భారత్‌ సుముఖంగా ఉందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్చెప్పారు. అట్టారి సరిహద్దు వద్ద అఫ్ఘాన్‌ ట్రక్కులకు స్వాగతం పలికేందుకు భారత్‌ సిద్ధమని పేర్కొన్నారు.  పాకిస్తాన్‌, అఫ్ఘానిస్తాన్‌తో పాటు ఆసియా దేశాల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు వచ్చే ఏడాది భారత పర్యటనకు రావాలని  ఆహ్వానించారు. బుధవారం ఇస్లామాబాద్‌లో  జరిగిన ‘హార్ట్‌ ఆఫ్‌ ఆసియా’ సదస్సులో సుష్మా ప్రసంగించారు. ఈ సమావేశంలో పాక్‌, అప్ఘాన్‌ ప్రధానులు నవాజ్‌ షరీఫ్‌, అష్రాఫ్‌ ఘనితో పాటు ఆసియా విదేశీ వ్యవహారాల మంత్రులు పాల్గొన్నారు.  సుష్మా పాక్‌ విదేశీ వ్యవహారాల మంత్రి సర్తాజ్‌ అజీజ్‌తో సమావేశమయయ్యారు.  మధ్యాహ్నం మరోసారి జరిగే చర్చల్లో భారత్‌, పాక్‌ ద్వైపాక్షిక క్రికెట్‌ సిరీస్పై ఓ నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో  కూడా సుష్మా భేటీ కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *