Monday, 2 November 2026

చారిత్రాత్మక మహా ఒప్పందం

C

– గ్రామాలకు తరలనున్న గోదావరి జలాలు

– తెలంగాణ మాగానుల్లో పసిడి పంటలు

– ఐదు బ్యారేజీల నిర్మాణానికి కుదిరిన ఒప్పందం

ముంబయి,మార్చి8(జనంసాక్షి): అంతర్‌ రాష్ట్ర వివాదాలకు తావు లేకుండా దేశంలోనే తొలిసారిగా గోదావరి నదిపై ఐదు ప్రాజెక్టుల నిర్మాణంపై మహారాష్ట్రతో తెలంగాణ ప్రబుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇది చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోనుంది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల సిఎంల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. గోదావరి నదిపై నిర్మించే ప్రాజెక్టు విషయమై తెలంగాణ-మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ముంబయిలోని సహ్యాద్రి అతిథిగృహం వేదికగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, ఫడణవీస్‌ల సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. అపర భగీరథుడు సీఎం కేసీఆర్‌ గోదావరి జలాల కోసం చేసిన ప్రయత్నం ఫలించింది. ఈమేరకు గోదావరి నదిపై నిర్మించనున్న ఐదు బ్యారేజీలకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కారు ఒప్పందంపై సంతకాలు చేసింది. ప్రస్తుతం గోదావరిపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు భవిష్యత్తులో చేపట్టే అన్ని ప్రాజెక్టులు దీని పరిధిలోకి రానున్నాయి. గోదావరి జలాలను రాష్ట్రంలోని తెలంగాణలోని బీడు భూములకు మళ్లించే దిశగా ఒప్పందంలో పేర్కొన్నారు. గత ఒప్పందాలు, కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులు ఒకే గొడుగు కిందకు రానున్నాయి. గత ప్రభుత్వాల ఒప్పందాలకూ కట్టుబడి ఉండాలని నిర్ణయించారు. కొత్త ప్రాజెక్టుల సాంకేతిక అంశాలకు నూతన బోర్డు పరిష్కారం చూపనుంది. ఒప్పం కుదుర్చుకోవడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నో ఉద్యమాల ఫలితంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి ఈ ఒప్పందంతో నీటి కష్టాలు తీరుతాయన్నారు. గోదావరి జలాలు సముద్రంలోకి వృథాగా పోతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కూడా అంటున్నారని… వృథాగా పోయే నీటిని ఎవరు వాడుకున్నా నష్టమేవిూ లేదన్నారు. ఈ ఒప్పందానికి అంగీకరించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు కేసీఆర్‌ కృతజ్ఞతలు చెప్పారు. ఈ ఒప్పందంతో తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. వచ్చే నూతన బోర్డు సమావేశానికి హైదరాబాద్‌ రావాల్సిందిగా ఫడణవీస్‌ను ఆహ్వానించారు. హైదరాబాద్‌ బిర్యానీతో ఆతిథ్యం ఇస్తామని చమత్కరించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి, అధికారులు అందరూ హైదరాబాద్‌ రావాలని.. వస్తే ప్రపంచ ప్రసిద్ధి చెందిన హైదరాబాదీ బిర్యానీ పెడతామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తమకు పొరుగు రాష్ట్రాలన్నింటితో సత్సంబంధాలు కావాలని, ఏ రాష్ట్రంతోనూ కొట్లాడబోమని ఆయన చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధప్రదేశ్‌.. అన్నింటితోనూ మంచి సంబంధాలే కోరుకుంటున్నట్లు చెప్పారు. ఒప్పందం సాకారం కావడానికి ముందుకు వచ్చిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌, గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము ప్రధానంగా నీళ్లు, ఉద్యోగాలు వస్తాయని ప్రజలకు చెప్పామని గుర్తుచేశారు. అలా నీళ్లు ఇవ్వడంలో ఇప్పుడు పడినది పెద్ద ముందడుగని అన్నారు. గోదావరిలో నీళ్లు చాలా ఉన్నాయని, మనం మనం గొడవపడితే ప్రయోజనం ఉండదని, కొన్ని నీళ్లు మహారాష్ట్ర వాడుకుంటే కొంత మనం వాడుకుందామని ఏపీ ముఖ్యమంత్రికి కూడా చెప్పానని ఆయన తెలిపారు. గోదావరి నదిపై ఐదు బ్యారేజీల నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం కుదిరిందన్నారు.  గోదావరిపై అయిదు బ్యారేజీలపై ఫడ్నవిస్‌ తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఒప్పందం చారిత్రక ఒప్పందంగా  నిలుస్తుందని కేసీఆర్‌ పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో ఎప్పుడూ నీటి వివాదాలు జరుగుతుండేవని, ప్రాజెక్టులు పూర్తికాలేదని కేసీఆర్‌ అన్నారు. ఇవాళ నాలుగు దశాబ్దాల సమస్య పరిష్కారమైందని స్పష్టం చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన ఈ ఒప్పందం చరిత్రాత్మమైనదని వ్యాఖ్యానించారు. తెలంగాణ-మహారాష్ట్ర చరిత్రలో ఇదొక మహత్తర ఘట్టమని అన్నారు. ఈ ఒప్పందం వల్ల తెలంగాణకు ఎంతో మేలు కలుగుతుందని పేర్కొన్నారు. ఒప్పందం ఎంతో అభినందనీయం, హర్షణీయమని తెలిపారు. 2 వేల నుంచి 4 వేల టీఎంసీల గోదావరి నీళ్లు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని అన్నారు. సముద్రంపాలయ్యే నీళ్లను ఎవరు వాడుకున్నా మంచిదేనని వ్యాఖ్యానించారు. ఎవరెక్కడున్నా మనం మొదట భారతీయులమని అన్నారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌ను హైదరాబాద్‌కు రావాల్సిందిగా కేసీఆర్‌ ఆహ్వానించారు. వచ్చే బోర్డు సమావేశానికి హైదరాబాద్‌కు రావాలని కోరారు. మేడిగడ్డ సహా ఐదు ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందాలపై ఇరు రాష్ట్రాల  ముఖ్యమంత్రులు సంతకాలు చేశారు.ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాలకు సాగు, తాగునీరు అందించడమే లక్ష్యంగా తుమ్మిడిహట్టి ప్రాజెక్టు 148 విూటర్ల ఎత్తు వరకు నిర్మించేందుకు అనుమతి లభించనుంది. ఏడాది కాలంగా ఫడ్నవిస్‌తో చర్చిస్తున్నామని, నాలుగు దశాబ్దాల సమస్యకు పరిష్కారం లభించిందని కేసీఆర్‌  ప్రకటించారు. ఈ ఒప్పందాలతో తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుందని కేసీఆర్‌ వివరించారు. ఈ ఒప్పందాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని మహా సిఎం ఫడ్నవిస్‌ అన్నారు. ఈ ఒప్పందం రెండు రాష్ట్రాలకు ఎంతో మేలు చేస్తుందని ఫడ్నవిస్‌ వివరించారు. ఈ ఒప్పందం వల్ల రెండు రాష్ట్రాల రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదులపై ఐదు బ్యారేజీలు కడతారని, నీళ్ల పంపిణీ విషయంలో ఇది మంచి ముందడుగు అవుతుందని ఆయన చెప్పారు. తెలంగాణకు కూడా దీనివల్ల మేలు కలుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు, రెండు రాష్ట్రాల అధికారుల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.సహ్యాద్రి అతిథి గృహంంలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఒప్పంద పత్రాలను ఇరు రాష్ట్రాల సీఎంలు ఇచ్చిపుచ్చుకున్నారు. అనంతరం మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం రెండు రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. గత యేడాదిగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఈ విషయమై చర్చిస్తున్నామని ఫడ్నవిస్‌ తెలిపారు. తెలంగాణతో మహారాష్ట్రకు సుధీర్ఘ అనుబంధం ఉందని పేర్కొన్నారు. ఇదిలావుండగా మహారాష్ట్రతో సిఎం కెసిఆర్‌ ఒప్పందంకారణంగా ఆదిలాబాద్‌కు మహర్దశ పట్టబోతోంది. ఇక్కడి గోదావరి జలాలలను వినియోగించుకునేలా ప్రాజెక్టులు కడతారు. వీటికి శంకుస్థాపన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలోనే జిల్లాలో  పర్యటిస్తారని టిఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర సరిహద్దున ఆదిలాబాద్‌ నియోజకవర్గ రైతుల కోసం పెన్‌గంగాపై చనాక, కోర్ట ఆనకట్ట, ఖానాపూర్‌ నియోజకవర్గ ప్రజల కోసం మామడ మండలం పోన్కల్‌ వద్ద గోదావరిపై సదర్మాట్‌ ఆనకట్ట నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమాలకు ఆయన రానున్నట్లు తెలిసింది. పెన్‌గంగా నదిపై చనకా, కోర్ట ఆనకట్ట నిర్మాణ పనులకు రూ.224 కోట్లతో టెండర్లు పూర్తయ్యాయి. దీనివల్ల జైనథ్‌, బేల మండలాల్లోని 13,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. కడెం, ఖానాపూర్‌ మండలాల రైతుల ప్రయోజనార్థం మామడ మండలం పోన్కల్‌ శివారులో సదర్మాట్‌ ఆనకట్ట నిర్మాణ పనులకు రూ.516.33 కోట్లకు పరిపాలన ఆమోదం లభించింది. దశాబ్దాల నుంచి ఆనకట్టల నిర్మాణంపై ప్రజలు ఆశలు పెంచుకోగా తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వీటికి మోక్షం లభించింది. చనాక, కోర్ట ఆనకట్ట పనుల శంకుస్థాపనకు సీఎం కేసీఆర్‌ నేరుగా జైనథ్‌ మండలం కోర్ట గ్రామానికి రానున్నారు. సదర్మాట్‌ ఆనకట్ట నిర్మాణానికి ఎక్కడ శిలాఫలకం ఆవిష్కరిస్తారనేది ఇంకా నిర్ణయం కాలేదని తెలిసింది. ముఖ్యమంత్రి పర్యటనపై అధికారికంగా త్వరలోనే ఉత్తర్వులు రానున్నాయని తెలుస్తోంది. ఇదిలావుంటే  ఆనకట్టల నిర్మాణానికి ఒప్పందం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం సోమవారం మహారాష్ట్ర వెళ్లడంతో జిల్లాలో తెరాస ఆధ్వర్యంలో గ్రామాల్లో, పట్టణాల్లో సంబరాలు చేసుకున్నారు. 8న మహారాష్ట్ర ముఖ్యమంత్రితో చేసుకునే ఈ ఒప్పందం కోసం ముఖ్యమంత్రితో పాటు భారీనీటిపారుదల మంత్రి హరీశ్‌రావు, జిల్లాకు చెందిన మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డిలు సోమవారం హైదరాబాద్‌ నుంచి విమానంలో బయలుదేరి వెళ్లారు. పార్టీ సూచనమేరకు సోమవారం సంబరాలు చేపట్టాలని ఆదేశాలు రావడంతో బోథ్‌, ఆదిలాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గాల్లో ఈ సంబరాలు నిర్వహించారు. గ్రామాల్లో కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతులకు మిఠాయిలు తినిపించారు. మరోపక్క మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకొని మంగళవారం హైదరాబాద్‌కు తిరిగిరానున్న కేసీఆర్‌ బృందానికి స్వాగతం పలికేందుకు జిల్లా నుంచి భారీగా తెరాస శ్రేణులు హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అపర భగీరథుడని  టిఆర్‌ఎస్‌ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి అన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ గోదావరి నదిపై ఐదు ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఆనకట్టల నిర్మాణంతో 950టీఎంసీల గోదావరి మిగులు జలాలు రాష్టాన్రికి ఉపయోగపడననున్నాయన్నారు. ఒప్పందంలో భాగంగా ఛనాకా-కోర్ట, తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ, అన్నారం, ఇంద్రావతి ఆనకట్టలను నిర్మించడం వల్ల 16లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరందుతుందన్నారు. వీటికి త్వరలోనే శంకుస్థాపన ఉంటుందని, త్వరలో సిఎం కెసిఆర్‌ పర్యటన తేదీలు ఖరారవుతాయని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *