– రిక్టర్ స్కేలుపై 6.8 గా నమోదు
– కుప్పకూలిన భవనాలు
– 6గురు మృతి
న్యూఢిల్లీ,జనవరి 4(జనంసాక్షి): ఈశాన్య భారతాన్ని భారీ భూకంపం కుదిపేసింది. గాఢనిద్రలో ఉన్న ఈశాన్య రాష్ట్రాల ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. మరికొద్ది గంటల్లో నిత్యకృత్యాల్లో మునిగిపోవాల్సిన ప్రజలు భయం నీడలో పరుగులు తీశారు. భారత్-మయన్మార్ సరిహద్దులో సోమవారం తెల్లవారుజామున 4.40 గంటల సమయంలో సుమారు 8సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.8గా నమోదైనట్లు అమెరికా భూ విజ్ఞాన సర్వే సంస్థ వెల్లడించింది. దీంతో మణిపూర్‌లో పలుభవనాలు కుప్పకూలాయి. ఆరుగురు మరణించినట్లు ప్రాథమికంగా వార్తలు వచ్చాయి. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మళ్లీ భూప్రకంపనల ప్రభావం తీవ్రంగా ఉంది. భూప్రకంపనలు సంభవించడంతో మణిపూర్ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇంఫాల్‌కు సవిూపంలోని టామెంగ్లాంగ్ జిల్లాలో 57 కిలోవిూటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఇంఫాల్ సహా టామెంగ్లాంగ్ సవిూప ప్రాంతాలల్లో ఆస్తినష్టం సంభవించింది. అనేక భవనాలు కుప్పకూలగా… పలు నిర్మాణాలు బీటలు వారాయి. ఇంఫాల్‌లోని ఓ ఆసుపత్రి నేలమట్టమైంది. ఈ ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందగా.. మరో 40మంది వరకు గాయపడ్డారు. వూహించని పరిణామానికి ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. తీవ్ర చలిలోనే రహదారులపై పడిగాపులు కాశారు. భూకంప ప్రభావంతో విద్యుత్, సమాచార వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలాలకు చేరుకుని సహాయకచర్యలు చేపడుతున్నారు.
మణిపూర్ సహా బంగాల్, అసోం, అరుణాచల్ ప్రదేశ్ రాష్టాల్ల్రోనూ భూమి కంపించింది. బంగ్లాదేశ్‌లో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బంగాల్‌లోని సిలిగురిలో భూప్రకంపనలు వచ్చినట్లు కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్ ట్విట్టర్‌లో తెలిపారు.
కేంద్ర ¬ంమంత్రిత్వ శాఖ సవిూక్ష
ఈశాన్య రాష్టాల్ల్రో సంభవించిన భూకంపంపై కేంద్ర ¬ంమంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి సవిూక్ష నిర్వహించింది. భూకంప ప్రభావం, సహాయచర్యలపై ఎన్‌డీఎంఏ, ఎన్టీఆర్‌ఎఫ్, సమాచార, రక్షణ, ఇరత ముఖ్య శాఖలతో ¬ంశాఖ ఉన్నతాధికారులు సవిూక్ష జరిపారు. భూకంపం కారణంగా పలు భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇంఫాల్‌లో ఆరంతస్తుల భవనం పూర్తిగా కుప్పకూలినట్లు కేంద్ర ¬ంమంత్రిత్వ శాఖ అధికారులు ప్రకటించారు. గువహటి నుంచి ఇంఫాల్‌కు 45 మంది గల రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు తరలించినట్లు తెలిపారు. ఈశాన్య రాష్టాల్ల్రో సంభవించిన భూకంపంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరా తీశారు. అసోం పర్యటనలో ఉన్న ¬ంమంత్రి రాజ్‌నాథ్‌తో మాట్లాడి సహాయచర్యల వివరాలు తెలుసుకున్నారు. సహాయచర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, అసోం రాష్ట్రాలముఖ్యమంత్రులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఫేస్‌బుక్ సేఫ్టీ చెక్
మణిపూర్ భూకంప బాధితుల సహాయార్థం ఫేస్‌బుక్ సేఫ్టీచెక్‌ను యాక్టివేట్ చేసింది. భూకంపంలో చిక్కుకున్న తమ వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు ఫేస్‌బుక్ సేఫ్టీచెక్ యాప్‌ను యాక్టివేట్
చేసినట్లు సంస్థ సీఈవో జుకర్‌బర్గ్ తెలిపారు. భారత్-మయన్మార్ సరిహద్దులో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించిన విషయం తెలుసుకున్న జుకర్‌బర్గ్ విచారం వ్యక్తం చేశారు. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భూకంప ప్రభావంతో బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్ దేశాల్లోనూ భూమి కంపించింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మణిపూర్‌లో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీంతో సాయం కోసం ఫేస్‌బుక్ ముందుకు వచ్చింది.
భూకంపంతో మంచం కదిలింది:అమితాబ్
ినిమా షూటింగ్ కోసం పశ్చిమ్‌బంగ రాజధాని కోల్‌కతాలో ఉన్న బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ భూకంప ప్రభావాన్ని ప్రత్యక్షంగా అనుభూతి చెందారు. సోమారం తెల్లవారు జామున భారత్-మయన్మార్ సరిహద్దులో 6.8 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. భూకంప ప్రభావంతో అస్సాం, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్, పశ్చిమ్‌బంగ తదితర ప్రాంతాల్లో పలు చోట్ల భూమి కంపించింది. తెల్లవారుజామున 4.30 ప్రాంతంలో భూకంపం వచ్చిందని. నిద్రలో ఉన్న తనకు మంచం కదలడంతో తొలుత ఏమైందో అర్థం కాలేదన్నారు. తెల్లవారాక భూకంపమని తెలిసిందని అమితాబ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. భూకంప ప్రభావిత ప్రాంతంలో ప్రజలు సురక్షితంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. రిబుదాస్ గుప్త దర్శకత్వంలో, సుజయ్ ఘోష్ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ కోసం అమితాబ్ కోల్‌కతాలో ఉన్నారు. ఈ సినిమాలో విద్యాబాలన్, నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా నటిస్తున్నారు.





