Tuesday, 3 November 2026

చిత్తూరులో యువతిపై అత్యాచార యత్నం

చిత్తూరు, మార్చి 29 : ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మహిళలపై అకృత్యాలు ఆగడం లేదు. రోజుకో చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పోలీసులు చూడీచూడనట్టు వ్యవహరిస్తుండడంతో వాటికి అడ్డుకట్ట లేకుండా పోతోందనే ఆరోపణలు వినబడుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం దిగువ మోదలపల్లి దళితవాడలో ఓ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *