చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం దుంగల పట్టివేత
హైదరాబాద్: చిత్తూరు జిల్లా భాకరాపేట కనుమదారిలో అటవీశాఖ, ప్రత్యేక కార్యదళం సంయుక్త దాడులు నిర్వహించాయి. 15 మంది ఎర్రచందనం కూలీలను అరెస్టు చేసిన పోలీసులు రూ.15లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు, 5 కార్లు స్వాధీనం చేసుకున్నారు.