తిరుపతి రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు
హైదరాబాద్: చిత్తూరు జిల్లా తిరుపతి రైల్వే స్టేషన్‌లో 8చోట్ల బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి అర్థరాత్రి రైల్వేస్టేషన్‌కు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన రైల్వే, తిరుపతి పోలీసులు రంగంలోకి దిగి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. స్టేషన్‌కు వచ్చే రైళ్లతో పాటు ఫ్లాట్‌పాంలు, ప్రయాణికులు వేచి ఉండే గదులను పరిశీలించారు. నాలుగైదు గంటల పాటు తనిఖీలు చేసి… చివరికి అది కేవలం బెదిరింపు కాల్ అని నిర్థరించారు. ఆగంతకుడు హిందీలో మాట్లాడాడని, అతని సెల్‌ఫోన్ నంబరు ఆధారంగా విచారణ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.